ఈ జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షకు సగం మందే హాజరు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతవరణంలో ప్రారంభమయ్యాయి.

Update: 2024-12-15 10:45 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతవరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు పరుగులు పెట్టారు. మొత్తం 19 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి కేంద్రం లోపలికి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. మొత్తం 8085 మంది అభ్యర్థులకు 3971 మంది హాజరవగా..4114 మంది గైర్హాజరయ్యారు. దీంతో హాజరు శాతం సగమే నమోదైంది. మొదటి పరీక్షకు 16 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో..వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు హాల్ టికెట్ మర్చిపోయి రావడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. కొందరు మహిళా అభ్యర్థులు తమ చిన్నారులకు బంధువులకు అప్పగించి పరీక్ష రాయడానికి వెళ్లారు.


Similar News