నిత్యాన్నదాన కార్యక్రమానికి ప్రారంభించిన ఎమ్మెల్యే

బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు దర్శించుకున్నారు.

Update: 2024-12-15 13:03 GMT

దిశ,బాన్సువాడ : బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు దర్శించుకున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోషియేషన్ సభ్యుల సహాకరంతో..తెలంగాణ తిరుమల దేవస్థానములో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న రైస్ మిల్ అసోషియేషన్ సభ్యులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో..శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి వాస్తవ్యులు నళిని - దయానంద్ జరిపించిన శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు,పోచారం శంభు రెడ్డి,నాగులగామ వెంకన్న,కృష్ణారెడ్డి, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,భక్తులు పాల్గొన్నారు.


Similar News