సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన ఉధృతం
నిరవధిక సమ్మెలో భాగంగా 6వ రోజు ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
దిశ, కామారెడ్డి :నిరవధిక సమ్మెలో భాగంగా 6వ రోజు ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సినిమా హీరో అల్లు అర్జున్ కారణంగా చనిపోయిన వ్యక్తి విషయంలో స్పందించిన తీరు బాగుందని, అలాగే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేసి మరణం పొందిన వారికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ డిమాండ్ ను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ప్రజా సంఘాల మద్దతు కోరుతూ..నిరవధిక సమ్మెను ఉధృతం చేసి విద్యా వ్యవస్థని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు సమ్మెకు మద్దతిస్తూ వారి సమస్యలు పరిష్కరించే వరకు తమ సంఘంలో ఉన్న ఉపాధ్యాయులను కేజీబీవీ లకి డిప్యూషన్ పంపమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు లింగం, వేణుగోపాల్, నళిని దేవి, భగత్, సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, రాములు, శ్రీవాణి, శైలజ, మాధవి, సరోజన, కాళిదాస్, లింగం, కవిత, బన్సీలాల్, రాజు, మౌనిక, కళ్యాణ్ ఇతరులు పాల్గొన్నారు.