అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

దుబాయ్ దేశానికి వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-12-15 14:24 GMT

దిశ,నవీపేట్ : దుబాయ్ దేశానికి వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని అబ్బాపూర్ తండా చెందిన కేతావత్ పీర్ చంద్ 8 సంవత్సరాల క్రితం అప్పులు చేసి..దుబాయ్ దేశానికి వెళ్లాడన్నారు. దుబాయ్ లో పని సరిగ్గా లేకపోవడంతో..ఇండియాకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడని తెలిపారు. గతంలో చేసిన అప్పులు తీరకపోవడంతో మరోసారి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా.. అప్పులు దొరకలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా..చూసిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య కేతావత్ కళావతి ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నవీపేట్ ఎస్సై కే.వినయ్ తెలిపారు.


Similar News