బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు బీమా ధీమా

పార్టీని నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తల కుటుంబాల్లో ధీమా నింపడానికే బీమా చెక్కులు అందజేస్తున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.

Update: 2024-12-15 11:12 GMT

దిశ, కామారెడ్డి : పార్టీని నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తల కుటుంబాల్లో ధీమా నింపడానికే బీమా చెక్కులు అందజేస్తున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్తల కుటుంబాల్లో భరోసా నింపడానికి రెండు లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ప్రమాదబీమా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేరుపై ప్రమాదబీమా ఇన్సూరెన్స్ పాలసీ పార్టీ తరపున కట్టినట్లు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం మాచారెడ్డి మండలం లచ్చాపేట్ గ్రామానికి చెందిన కైరంకొండ శివరాములు, జక్కుల రాంచంద్రం ప్రమాదవశాత్తూ మరణించగా..వారి కుటుంబాలకు ఈ చెక్కులను ఆందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ జడ్పీటీసీ మీన్కురి రాంరెడ్డి, నల్లవేల్లి ఆశోక్, శంకర్, గెరిగంటి లక్ష్మినారాయణ, లచ్చపేట్ మాజీ ఎంపీటీసీ బుస శ్రీనివాస్, లద్దురి కృష్ణ యాదవ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News