ఆలూరులో ఘనంగా విజయదశమి వేడుకలు..

ఆలూరు మండల కేంద్రంలో ఘనంగా విజయదశమి వేడుకలను వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Update: 2024-10-12 17:15 GMT

దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలో ఘనంగా విజయదశమి వేడుకలను వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ల ముత్యం, గాండ్ల రామచందర్, ముక్కెర విజయ్ మాట్లాడుతూ విజయదశమి ప్రాముఖ్యతను వివరిస్తూ ఆలూరుకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తామని అన్నారు.

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆలూరు అభివృద్ధికి తోడ్పడుతానని, ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు బార్ల ముత్యం, ఆలూరు స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు గాండ్ల రామచందర్, ఆలూర్ కాంగ్రెస్ నాయకులు ముక్కెర విజయ్, శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ నాయకులు కొత్తూరు గంగాధర్,డాక్టర్ అరుణ్,నాడీశరం మల్లయ్య, మాజీ సర్పంచ్ కళ్లెం మోహన్, ఉప సర్పంచ్ దుర్మాజి శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేష్, నవనీత్, లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News