ఎట్టకేలకు బీర్కూర్ పోలీస్ స్టేషన్ కు ఎస్సై నియామకం

బీర్కూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కామారెడ్డి స్పెషల్ బ్రాంచ్ఎ నుంచి వచ్చిన ఎస్.బాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

Update: 2023-05-15 08:57 GMT

దిశ కథనాలకు స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు

దిశ, బీర్కూర్ : బీర్కూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కామారెడ్డి స్పెషల్ బ్రాంచ్ఎ నుంచి వచ్చిన ఎస్.బాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సుమారు సంవత్సర కాలం పాటు ఇన్ చార్జ్ ఏఎస్ఐలతో పాలన కొనసాగింది. కొందరు బీర్కూర్ కు ఎస్సైగా వచ్చేందుకు కూడా భయపడ్డారు. ఇందుకు గల ప్రధాన కారణా బీర్కూరు మండలం మంజీరా నది పరిహక ప్రాంతం కావడంతో ఇక్కడ ఎథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా, మొరం తవ్వకాలు, మితిమీరిన రాజకీయ జోక్యం ఉండడంతో ఎస్సైలు అక్కడ విధులు నిర్వర్తించేందకు ఇష్టపడలేదు.

బీర్కూరు పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ ఏఎస్సైలు ఉన్నప్పటికీ వారిని రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడి పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను దర్జాగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇప్పటికైనా నూతనంగా వచ్చిన ఎస్ఐ అక్రమ ఇసుక రవాణా, మొరం తవ్వకాలపై ఉక్కు పాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా బీర్కూర్ పోలీస్ స్టేషన్ కు ఎస్సైని తిరిగి నియమించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More:    తెలంగాణలో మరో ఎస్ఐ సస్పెండ్ కలకలం 

Tags:    

Similar News