జంతువుల జీవనాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

సహజసిద్ధమైన ప్రకృతిలో జంతువుల జీవనాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.

Update: 2024-03-15 11:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సహజసిద్ధమైన ప్రకృతిలో జంతువుల జీవనాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ఎన్విరాన్మెంటల్ వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు ,సీనియర్ న్యాయవాది మంథని రాజేందర్ రెడ్డి, కార్యదర్శి క్యాతం సంతోష్, కోశాధికారి హితేన్ భాయ్, సభ్యులు దర్శన్ సింగ్ సోకి, కట్కం శ్రీనివాస్ లతో కలిసి తన చాంబర్ లో వన్యప్రాణుల సంరక్షణ, పోషణ అనే ప్రచార కరపత్రాలను అవిష్కరించారు.

     ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో జలాశయంలో తగ్గుదల వలన కృష్ణ జింకలు, ఫ్లెమింగ్ బర్డ్స్ లాంటి ఎన్నో అద్భుతమైన పశుపక్షాదులు, వన్యప్రాణులు కనబడే, వలసవచ్చే సమయంలో వాటి జీవనశైలికి హానికరంగా ఉండరాదని ఆమె అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్ సాగర్, పోచారం అభయారణ్యం, మంచిప్ప అటవీప్రాంతంతో పాటుగా ఇతర ప్రాంతాల్లో వన్యప్రాణులను వనంలో సురక్షితంగా ఉండే విధంగా స్థానిక ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్లాస్టిక్ ను ఎక్కడబడితే అక్కడ విసిరి వేయరాదని పేర్కొన్నారు. జంతు ప్రపంచమే జన జీవనానికి జీవవాయువుగా పనిచేస్తుందని జిల్లా జడ్జి తెలిపారు. పర్యావరణ, వన్యప్రాణుల ప్రేమికుల ప్రేరణతో ప్రచారంతో అందరూ జత కలిసి వైడ్ లైఫ్ ను మానవ సమాజంతో పాటు ఎదగనిద్దామని అన్నారు. 


Similar News