వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దు

జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

Update: 2024-03-14 09:45 GMT

దిశ, కామారెడ్డి : జాతీయ రైతు సంఘాల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చే ముందు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పారని, దేశ ప్రజలందరూ జన్ ధన్ ఖాతాలు తీయాలని, ఆ ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని చెప్పారని,

    యువతకి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాడని, అవి ఏమీ అమలు చేయకుండానే మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఉవ్వీల్లూరుతున్నారన్నారు. అదేవిధంగా దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో 13 నెలల పాటు ఉద్యమిస్తే నరేంద్ర మోడీ రైతు ఉద్యమాలకు దిగివచ్చి రైతుల డిమాండ్ల సాధనకు ఒప్పుకొని ఇప్పుడు దొంగ చాటున పాత చట్టాలను కొనసాగిస్తామని ఆరోపించారు. ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, రహదారులు, సముద్ర మార్గాలు, రైల్వేలు తదితర ప్రభుత్వ సంస్థలు అమ్మివేశారన్నారు. ఈ దేశ సంపద ఆదానికి, అంబానీకి చెందిన కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు మిగిలింది వ్యవసాయ రంగం ఒకటేనని, దీనిని మనం కాపాడుకోకపోతే వ్యవసాయ రంగం

    ఈ దేశంలో తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 250కి పైగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సంయుక్త కిసాన్ సంఘం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 14న కిసాన్ పంచాయతీలు, నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి. పరమేష్, ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు బాలరాజ్, కార్యదర్శి ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సీహెచ్.అంబన్న, జిల్లా నాయకులు కిషోర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు ముఖేష్, క్రాంతి, లక్ష్మీనారాయణ, రాజు, గోపాల్, సత్యం రెడ్డి, సింగ్, రాజు, దేవేందర్, వెంకట్, పెంటన్న, సామేల్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News