దిశ ఎఫెక్ట్...హాస్పిటల్ ను సందర్శించిన డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి

దిశ పత్రికలో గురువారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ పై వచ్చిన వార్త కథనానికి కామారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి శుక్రవారం గాంధారి లోని ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు.

Update: 2024-03-14 15:45 GMT

దిశ, గాంధారి : దిశ పత్రికలో గురువారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ పై వచ్చిన వార్త కథనానికి కామారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి శుక్రవారం గాంధారి లోని ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి హాస్పిటల్ లో సందర్శించి నార్మల్ డెలివరీలు పెంచాలని, అంతేకాకుండా డెలివరీ రిజిస్టర్, ఐపీ రిజిస్టర్ పరిశీలించి నార్మల్ డెలివరీలు ఇంకా పెంచాలని అన్నారు.

    అంతేకాకుండా పేషెంట్ కు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ కు సరైన డైట్ అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శానిటైజర్ సిబ్బంది వేతనాలు ఇవ్వాలని ఆసుపత్రి ఇంచార్జ్ లకు సూచించారు. హాస్పిటల్ ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందులో భాగంగా డాక్టర్ సాహితి ప్రసాద్, స్టాఫ్ నర్స్ ఝాన్సీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ మిత్రాలు జయవర్ధన్, కృష్ణ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.  


Similar News