ప్రాణాంతకంగా మారిన కూల్ డ్రింక్స్..
కూల్ డ్రింక్స్, మిఠాయి, హోటళ్లు, కిరాణా తదితర దుకాణాల్లో గడువు మీరిన

దిశ, మాచారెడ్డి : కూల్ డ్రింక్స్, మిఠాయి, హోటళ్లు, కిరాణా తదితర దుకాణాల్లో గడువు మీరిన కూల్ డ్రింక్స్ విక్రయాలు చేస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వేసవి దాహం తీర్చుకునే క్రమంలో ఎక్స్పైర్ తేదిని చూసుకోరు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో కొందరు యువకులు చిల్ద్ అవుదామని ఒక దుకాణంలో థమ్సప్, వాటర్ పాకెట్లు తీసుకున్నారు. థమ్సప్ తాగుదామని మూత విప్పి కొంత తాగిన తర్వాత వాంతులయ్యాయి.
దీంతో ఎక్స్పైర్ తేదిని పరిశీలించారు. మ్యాన్ ఫక్ చ్ తేది: 27-5-2024,.ఎక్స్ పైర్ తేది: 27–11-2024 ని గమనించారు. ఖంగు తిన్న కొనుగోలు దారులు దుకాణం వద్దకు వెళ్లి నిలదీశారు. కూల్ డ్రింక్ విక్రేత మాత్రం తగ్గేదెలా…అనే చందంగా గడువు తీరిన మాట ఓకె, వాంతులయ్యాయంటే ఒప్పుకునేది లేదని వాదించడంతో విస్మయానికి గురయ్యారు. ఏ వస్తువునైనా కొనుగోలు చేసే ముందు ఎక్స్పైర్ తేదిని చూసి కొనుగోలు చేయాలని కొందరు, ఆ దుకాణం పేరు చెబితే అడుగుదామని కొందరు, కొనుగోలు చేసే వారందరు తేదీలు చూసి కొంటారా? అమ్మేవారు వినియోగదారులను మోసం చేయకుండా వ్యాపారాలు చేసుకోవాలని, వారి ప్రాణాలతో చెలగాటమాడవద్దని హితవు పలికారు. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..