24న జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం
ఈ నెల 24న మధ్యాహ్నం మూడు గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హల్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు తెలిపారు. ఈ

దిశ, కామారెడ్డి : ఈ నెల 24న మధ్యాహ్నం మూడు గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హల్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జహరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేశ్ కుమార్ షెట్కార్, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్మోహన్ రావ్, జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంత్ రావ్, తెలంగాణ అగ్రో చైర్మన్ కాసుల బాల్ రాజు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలోని పార్టీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరు కావాలని కోరారు.