లారీ ఆపలేదని డ్రైవర్‌పై ఆర్టీఏ చెక్ పోస్ట్ ప్రైవేటు సైన్యం పిడిగుద్దులతో దాడి..

కంటైనర్ ఆపలేదన్న కోపంతో... వెనకాలే కారు వేసుకొని వచ్చి, టోల్ ప్లాజా వద్ద

Update: 2025-03-21 06:41 GMT
లారీ ఆపలేదని డ్రైవర్‌పై ఆర్టీఏ చెక్ పోస్ట్ ప్రైవేటు సైన్యం పిడిగుద్దులతో దాడి..
  • whatsapp icon

దిశ,భిక్కనూరు : కంటైనర్ ఆపలేదన్న కోపంతో... వెనకాలే కారు వేసుకొని వచ్చి, టోల్ ప్లాజా వద్ద ఆగి కంటైనర్ లో నుంచి డ్రైవర్ ను కిందకి గుంజి, ప్రైవేట్ సైన్యం పిడి గుద్దులతో రక్తం కారేటట్టు కొట్టిన సంఘటన శుక్రవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాందేడ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్, మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద, విజిల్ కొడుతూ అక్కడ పనిచేస్తున్న ప్రైవేట్ సైన్యం ఆపగా, కంటైనర్ అక్కడ ఆపకుండా డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు.

దీంతో కోపోద్రిక్తులైన అక్కడి ప్రైవేట్ సైన్యం కారులో వచ్చి టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కంటైనర్ లో నుంచి, డ్రైవర్ ను కిందకు గుంజి రక్తం కారేటట్టు పిడి గుద్దులు గుద్దారు. దీంతో క్యాబిన్ లో పడుకున్న కంటైనర్ మెయిన్ డ్రైవర్ భయపడిపోయి, కంటైనర్ కిందికి వచ్చి నక్కి పడుకున్నాడు. పిడిగుద్దుల దాడిలో నోట్లో నుంచి రక్తం వస్తుండడంతో, డ్రైవర్ 100కు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితున్ని స్టేషన్ కు తీసుకెళ్లారు. కంటైనర్ ను మాత్రం చెక్ పోస్ట్ సిబ్బంది డ్రైవర్ చేతిలో నుంచి తాళాలు గుంజుకొని, కంటైనర్ ను చెక్ పోస్ట్ కు తీసుకెళ్లారు.

Similar News