మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం 4 రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై కురుమూర్తి గురువారం తెలిపారు.

దిశ, వెల్దండ: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం 4 రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై కురుమూర్తి గురువారం తెలిపారు. గత సంవత్సరం 19 డిసెంబర్ 2024 తేదీన వాహనాల తనిఖీలు నిర్వహించగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్న కల్వకుర్తి పరిధిలోని భగత్ సింగ్ తాండాకు చెందిన ఇస్లావత్ శ్రీనుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గురువారం కల్వకుర్తి జేఎఫ్ సీఎం కోర్టు లో హాజరుపరుచగా.. న్యాయమూర్తి నిందితునికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తీర్పు వెల్లడించినట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. కావున మద్యం తాగి ఎవరూ కూడా వాహనాలు నడపవద్దని.. పట్టుపడితే అది ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనని ఎస్సై కురుమూర్తి హెచ్చరించారు.