ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు..
శుక్రవారం నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజున ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

దిశ, కామారెడ్డి : శుక్రవారం నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజున ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని గౌతమ్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. పరీక్ష కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులకు గాను, 12,552 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, 27 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కలెక్టర్ వెంట కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్ ఉన్నారు.