ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలి

ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

Update: 2025-03-21 09:37 GMT
ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలి
  • whatsapp icon

దిశ, కామారెడ్డి : ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలతో నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తొ కలిసి కామారెడ్డి పట్టణం, నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉత్పన్నం కాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

కామారెడ్డి మున్సిపల్ ఏరియాలో అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా చేపడుతున్న పనులపై ఆయన సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా చేపట్టే పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఏరియాలో రోజుకు రెండు సార్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పట్టణంలో 33/11 కే.వి. అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించి కేటాయించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. త్రాగునీటి అవసరాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ నిధులను వినియోగించుకోవాలని, అవసర మేరకు ఉన్నతాధికారులకు వివరించి నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.

మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. కామారెడ్డి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, రంజాన్ పండుగ నేపథ్యంలో రోజుకు రెండుసార్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో 33/11 కే.వి. సబ్ స్టేషన్ కోసం అవసరమైన భూమిని గుర్తించాలని అదనపు కలెక్టర్ కు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News