ఆర్మూర్‌లో ముగియనున్న తై బజార్ వేలం పాట..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో గత ఏడాది తై బజార్ వేలం

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో గత ఏడాది తై బజార్ వేలం దక్కించుకున్న వ్యక్తి తైబజార్ డబ్బుల వసూలు ముగియనున్నది. గత ఏడాది టైం బజార్ వేలంపాటలో దక్కించుకున్న సదరు వ్యాపారి వేలంపాట ఈనెల 24వ తేదీతో ముగియనుండగా, ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తైబజార్ వసూళ్లకై నూతన తలుపు దారి వేలం పాటను ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఇతర మున్సిపల్ అధికారుల సమక్షంలో నిర్వహించ నున్నారు.
ఆర్మూర్ మున్సిపల్ వేలంపాట కనీసం మొత్తం రూ.23, 89, 750 /- గా మున్సిపల్ కమిషనర్ రాజు నిర్ణయించారు. తై బజార్ వేలం పాటలో పాల్గొనాలను కునేవారు రెండు డీడీలు సమర్పించాల్సి ఉంటుంది.రూ.5 లక్షల డిపాజిట్ సంబంధించిన, ఐదు వేల రూపాయల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డీడీలు ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి.నియమ నిబంధనలు మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డు పైన పొందుపర్చి ఉన్నాయి. ఆర్మూర్ టైం బజార్ వేలంపాటలో వేలం పాటను దక్కించు కోవలసిన 25న ఉదయం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులు సూచించిన పత్రాలను పొందుపరచుకొని వేలంపాటలో పాల్గొనాలి.