focus : నగరంలో పారిశుద్ధ్య పనులపై కమిషనర్ ఫోకస్

పారిశుద్ధ్య సమస్యల కారణంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరందు పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Update: 2024-08-17 09:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పారిశుద్ధ్య సమస్యల కారణంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరందు పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెండు, మూడు రోజులుగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక్కడ ఏ సమస్య కనిపించిన అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా శనివారం కూడా నగరంలోని పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ కమిషనర్ పరిశీలించారు. ఖచ్చితమైన సమయపాలన పాటిస్తూ పరిశుద్ధ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని పారిశుధ్య సిబ్బందికి కమిషనర్ సూచించారు. ఉదయం ఆయన

పూలాంగ్, గోల్ హనుమాన్ జోన్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో హాజరు పట్టికను, ఇతర రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అనంతరం ఆర్సపల్లి రైల్వే గేట్ గ్రావెల్ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. పనులు నిర్వహిస్తున్న సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News