స్త్రీ నిధిలో బెస్ట్.. మన ఇందూరు ఫస్ట్

స్త్రీనిధిలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే నెం.1 గా నిలిచింది.

Update: 2024-08-14 15:44 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : స్త్రీనిధిలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే నెం.1 గా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈ సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని చేజార్చుకోకుండా ఆ ఘనతను నిలుపుకుంది. బుధవారం స్త్రీనిధి 11వ సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా నిజామాబాద్ డీఆర్డీ ఓ పీడీ డి. సాయగౌడ్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లా స్త్రీనిధి గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయిలోనే

    ప్రథమ స్థానంలో కొనసాగుతున్నందున హైదరాబాదులోని జయశంకర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం దక్కిందని డీ ఆర్ డీ ఏ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో సెక్రటరీ లోకేష్, సెర్ప్ సీఈఓ దివ్య దేవ రాజన్, జెడ్ఎం లు అనంత కిషోర్, రవికుమార్, ఆర్ ఎం రాందాస్ లు, జిల్లా సమాఖ్య ఈసీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే స్త్రీనిధి లోని అన్ని కార్యక్రమాల్లోనూ నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల సమాఖ్య మొదటి స్థానం సాధించింది. కమ్మర్ పల్లి మండల సమాఖ్యకు కూడా అవార్డు దక్కింది. ఇదే కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా కమ్మర్ పల్లి ఏపీఎం కుంట గంగారెడ్డి, సమాఖ్య అధ్యక్షులు అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

Tags:    

Similar News