తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ..

మండలంలో అన్ని గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభించారు.

Update: 2024-10-12 09:18 GMT

దిశ, తాడ్వాయి : మండలంలో అన్ని గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో విజయదశమి వేడుకలను పోలీస్ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఎస్సై వెంకటేశ్వర్ల సమక్షంలో పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం ఆయుధాల పై పురోహితులు వేదమంత్రాలతో పూజించి ఇచ్చిన అక్షతలను చల్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు తమ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో దసరా పండుగ జరుపుకున్నామని, ఈ సందర్భంగా ఆయుధ పూజ చేశామని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో మండల ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. పోలీస్ సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని కోరుతూ పోలీసు సిబ్బందికి, మండలం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.


Similar News