నన్ను ఓడిస్తానన్నావు... జైలు నుంచి నామినేషన్ వేస్తావా...!

బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంపై జిల్లా ఎంపీ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-16 09:46 GMT

దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంపై జిల్లా ఎంపీ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మూర్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని గతంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారని, జైలు నుంచి నామినేషన్ వేసి.. నన్ను ఓడిస్తుందా అని చమత్కరించారు. శుక్రవారం అని చూడకుండా ఆడపడుచును ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారని బీఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరమన్నారు.

    ఈ లిక్కర్ స్కామ్ లో సమావేశాలు శుక్రవారం నాడే జరిగాయని విమర్శించారు. శుక్రవారం మంచి రోజు కాబట్టే పైసలు బాగా దొరుకుతాయని లిక్కర్ స్కాం చేశారని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అరెస్టు చేస్తే ఒక బాధ చేయకపోతే మరొక బాధ ఉన్నట్టు ఉందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్, నూతల శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతి, ద్యాగ ఉదయ్ కుమార్, పోల్కం వేణు, మందుల బాలు, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Similar News