బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా యామాద్రి భాస్కర్
భారతీయ జనతా పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన యామాద్రి భాస్కర్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా శనివారం నియమితులయ్యారు.
దిశ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన యామాద్రి భాస్కర్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా శనివారం నియమితులయ్యారు. యామాద్రి భాస్కర్ ముందు రోజుల్లో బీజేపీ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్ష పదవిని స్వీకరించి పార్టీ సిద్ధాంతం, ఆదర్శాలకు పునరించితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ సహచర కార్యకర్తలకు పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని బీజేపీ ఉన్నత వర్గ నాయకులు కోరారు. ఇందూరు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీ సంస్థాగతంగా పటిష్టపరిచాలని బీజేపీ అన్ని వర్గాలలో మరింత విస్తరించేలా కృషి చేయాలని కోరారు.
ఆర్మూర్ కు చెందిన యామాద్రి భాస్కర్ కు జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవికి నియమితులు కావడం పట్ల పలువురు పట్టణ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ పార్టీ సంస్థాగత బలోపేతానికి తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలకు తప్పకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని యామాద్రి భాస్కర్ పేర్కొన్నారు. యామాద్రి భాస్కర్ ఏ పార్టీలో ఉన్న పదవులను అందుకోవడంలో అందవేసిన చేయిగా రాజకీయాల్లో చురుకుగా కదులుతుంటారని ఆర్మూర్ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు.
గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి అనుచరుడిగా ఉంటూ ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి ఆయన భార్య యామాద్రి కవితకు రావడంలో విశేషంగా కృషిచేసి సఫలీకృతుడయ్యాడు. అదే తరహాలో గత ఏడాది భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా పదవిని యామాద్రి భాస్కర్ అందుకున్నారు. ఇలా ఏ పార్టీలో ఉన్న పదవులు అందుకోవడంలో యామాద్రి భాస్కర్ అందవేసిన చేయిలా రాజకీయాల్లో మెరుపుచుక్కలా ముందుకు సాగుతున్నారని ఆర్మూర్ ప్రజలు పేర్కొంటున్నారు.