కోటగల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఏసీబీ తనిఖీలు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ రైడ్ జరిగి వారం తిరక్క ముందే నగరంలోని ఏసీబీ మరో రైడ్ నిర్వహించింది.

Update: 2024-08-13 03:12 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ రైడ్ జరిగి వారం తిరక్క ముందే నగరంలోని ఏసీబీ మరో రైడ్ నిర్వహించింది. తాజాగా నగరంలోని కోటగల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో మంగళవారం ఉదయాన్నే వచ్చి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ పై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరుస ఏసీబీ దాడులతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారుల్లో వణుకు మొదలైంది. దీంతో ఏసీబీ పంజా ఎప్పుడు తమపై పడుతుందోననే అనుమానంతో అవినీతిపరులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News