పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల తాగి ఆత్మహత్య చేసుకున్నాడు

Update: 2024-12-27 12:19 GMT

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన యాదగిరి నాగేంద్ర (21)   ఈ నెల 21వ తేదీన పురుగుల మందు తాగాడు. దీంతో గమనించిన స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  నాగేంద్ర చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్హెచ్ఓ పేర్కొన్నారు.


Similar News