వాడి వేడిగా సాగిన సర్వ సభ్య సమావేశం..
అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
దిశ, గాంధారి: అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో పై స్థాయి అధికారులకు నివేదిక అందిస్తామని సర్వసభ్య సమావేశంలో వాడివేడీగా చర్చ జరిగింది. ఉపాధి హామీ భవనంలో సర్వసభ్య సమావేశం గరం గరంగా సాగింది. పలు శాఖల వారీగా పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఆరోగ్యశాఖ, కరెంట్ డిపార్ట్‌మెంట్ పైన గాంధారి మండల ఎంపీపీ రాధా బలరాం, సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మండిపడ్డారు. కనీసం గాయపడ్డ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం లేదని వారు ఫైర్ అయ్యారు.
ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి నెల మీటింగ్ పెట్టాల్సి ఉన్నా, మీ ఇష్టం వచ్చినట్టు మీటింగ్ పెట్టడం ఏంటని మండిపడ్డారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోగ్య శాఖపై మండిపడ్డారు. విద్యుత్ ఏఈ గురించి అయితే చెప్పనవసరం లేదు వివిధ గ్రామాల నుండి సర్పంచులు పల్లె ప్రకృతి వనంలో స్తంభాలు కావాలి అని వినతి పత్రాలు ఎన్ని అందజేసిన ఉపయోగం లేదని తమ దగ్గర వాళ్ళ బాధలు వెల్లబోసుకుంటున్నారని తెలిపారు. ఏఈ ఈ సమస్యపై ఏం సమాధానం చెబుతారని సీరియస్ అయ్యారు.
గాంధారి నుంచి ఇది వరకు 9 గంటల వరకు బస్సు ఉండ డిపోమేనేజర్ 7 గంటలకే బస్సు నిలిపివేయడం సరికాదన్నారు. 9 గంటల వరకు బస్సు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్తు శాఖపై వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు మండిపడ్డారు. ప్రజలకు ఇన్ టైంలో సేవలు అందిస్తే ఎలాంటి సమస్య ఉండదని వారన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గాంధారి మండల గ్రామ పంచాయతీలకు వచ్చిన అవార్డ్స్ తీసుకున్న సర్పంచులను సన్మానించారు. వివిధ సర్పంచులకి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గోవర్ధన్, ఎంపీడీవో సతీష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.