‘‘ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు మేడం’’.. IAS స్మితా సబర్వాల్‌పై నెటిజన్స్ ఫైర్
తెలంగాణ సీఎంవో అధికారిణి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్విట్టర్‌లో అనేక ప్రజా సమస్యలపై స్పందిస్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎంవో అధికారిణి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్విట్టర్‌లో అనేక ప్రజా సమస్యలపై స్పందిస్తారు. దీంతో ఆమె ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. స్మితా సబర్వాల్ ట్విట్టర్‌లో ఏ పోస్టు చేసిన కూడా లైక్‌లు, విమర్శల రూపంలో కామెంట్స్ భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం స్మితా సబర్వాల్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన సచివాలయం ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫిల్టర్ యూస్ చేయకుండా దించిన ఫోటో అని పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో నెటిజన్స్ స్మితా సబర్వాల్‌పై ఫైర్ అవుతున్నారు.
నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. ‘‘మెడికో ప్రీతి గురించి ఒక్కసారైనా పోస్ట్ పెట్టావా అక్క?.. తెలంగాణలో కుక్కలు కరిచి చిన్నపిల్లలు చనిపోతే ఒక్కసారి ఐనా స్పందించావా? నీ భజన పోస్ట్‌లా వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి ఒక కుటుంబానికి అయిన న్యాయం జరిగిందా ఈ పోస్టు వల్ల? అంటూ కామెంట్స్ చేశారు. ఇంకొకరు కామెంట్ చేస్తూ.. ఫొటోగ్రఫీ కూడా వీల్లే చేస్తే.. ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారని కామెంట్స్ చేశారు.
మరో నెటిజన్.. ‘‘ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు మేడం.. ఎంతో గౌరవం ఉండేది మీరు కూడా ఇలా భజన బ్యాచ్‌లో చేరి భజన చేస్తారు అనుకోలేదు’’ అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. మరొక కామెంట్ చేస్తూ.. ‘‘మీ పార్టీ రంగు అనే కదా మీ అర్థం... నిన్న మ్యాన్ హోల్‌లో పడి పాప చనిపోతే, కుక్కలు పిల్లల్ని చంపినప్పుడు, మెడికో ప్రీతి చనిపోయినపుడు, కూడా ఆకాశం ఇలాగే ఎరుపు రంగు చూపింది. అప్పుడు ఏమయ్యాయి మీ నో ఫిల్టర్ ఫోటోస్’’ అంటూ కామెంట్ చేశారు.
Read more:
ఆర్టీసీ ఎండీకి కోపం తెప్పించిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్ వైరల్ (వీడియో)