నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డ్.. ఈ నెల 10కి విచారణ వాయిదా

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. సమంత, నాగచైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-10-08 11:09 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. సమంత, నాగచైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాగార్జున కుటుంభం తక్షన క్షమాపణలు కోరారు. అనంతరం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా.. ఈ రోజు విచారణ జరిగింది. ఇందులో భాగంగా నాగార్జున స్టేట్‌మెంట్ ను నాంపల్లి కోర్టులో రికార్డు చేశారు. అలాగే ప్రదాన సాక్షిగా వచ్చిన సుప్రియ అనే మహిళ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అనంతరం విచారణను ఈ నెల 10 కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అలాగే మరో సాక్షి అయిన వేంకటేశ్వర్లు స్టేట్‌మెంట్ ను కూడా ఆ రోజునే రికార్డు చేయనున్నట్లు తెలిపారు.

కాగా ఈ రోజు హీరో నాగార్జున కోర్టుకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో ఇలా చెప్పుకొచ్చారు. "రాష్ట్రంలో మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ నా కుటుంబంపై అమర్యాద వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు అన్ని చానల్స్, పేపర్లలో వచ్చాయి. దీంతో మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. హీరో నాగార్జున తన స్టేట్ మెంట్ లో చెప్పుకొచ్చారు. కాగా ఈ నెల 10న జరిగే విచారణ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Similar News