భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సీపీఎంను గెలిపించండి
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీపీఎం పార్టీని గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.
దిశ, యాదాద్రి కలెక్టరేట్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీపీఎం పార్టీని గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గంల్లో సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాలు సాగించిన కేంద్రాలు ఉన్నాయని, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసిన ఘనత సీపీఎంకు ఉందన్నారు. ఎర్ర జెండా గొప్పతనం తెలిసిన గ్రామాలు ఈ నియోజకవర్గాలల్లో ఉన్నాయని కొనియాడారు. ప్రజలు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే సీపీఎం పార్టీ త్యాగాలను గుర్తు చేసుకోవాలని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఎం పార్టీ గెలవడం అవసరం అని రావి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపిన ప్రాంతమని సీపీఎం అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆయన వెంట సీపీఐఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం,దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, బబ్బురి పోశెట్టి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, ప్రజాసంఘాల నాయకులు వనం రాజు, బోడ భాగ్య, సందెల రాజేష్, లావుడియా రాజు, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.