రెండు లక్షల పైన రుణం తీసుకున్న వారికి శుభవార్త.. మంత్రి తుమ్మల

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎసెల్బిసీలో గల బత్తాయి మార్కెట్ లో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

Update: 2024-10-16 06:43 GMT

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎసెల్బిసీలో గల బత్తాయి మార్కెట్ లో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వంగా రైతులకు అండగా ఉంటున్నాం అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకున్నా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు. 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినం అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని అన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు అందుబాటులో ఉన్నారని అన్నారు. 50 వేల ఎకరాల్లో నల్లగొండ జిల్లాలో బత్తాయి పంట పండుతుంది. కావున కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.

అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోట నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అని కొనియాడారు. నల్లగొండకి తనకు చాలా దగ్గర సంబంధం ఉంది అన్నారు. ఎక్కువ కష్టపడి పని చేసే రైతాంగం ఉన్న జిల్లా నల్లగొండ, ఖమ్మం జిల్లా అని అన్నారు. రైతులకు తప్పకుండా టన్నెల్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుతో నీటిని అందించే దిశగా వెంకటరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ప్రజలు ఇచ్చిన బలమే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభివృద్ధి వైపు పనిచేసే దిశగా పనిచేస్తున్నారు అన్నారు. అన్ని వ్యవస్థలు గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయ్యాయి. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల పై భారం మోపుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పాడు చేసిన వారు నేడు శ్రీరంగా నీతులు చెప్తున్నారు అన్నారు. వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. 31 వేల కోట్ల రూపాయలతో పూర్తిగా మేము రుణమాఫీ చేస్తాం అన్నారు. రైతును ఆదుకోవాలి అని అన్నారు. ఈ నెలలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది అన్నారు. అలాగే రెండు లక్షల పైన వారికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అన్నారు. క్యాబినెట్ ఆలోచన చేసి రైతు పంటకు బీమా కూడా మనమే చేయాలి అని పంట బీమా ప్రభుత్వమే ప్రీమియం కడుతుంది అన్నారు. ధాన్యం కొనుగోలులో దొడ్డు, సన్న రకాలు రైతులు సక్రమంగా తీసుకొని రావాలన్నారు.

భారతదేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. అలాగే కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిచినం. సన్న రకం ధాన్యం కి 500 బోనస్ ఇస్తున్నాం అన్నారు. రైతాంగంకి ఎలాంటి నష్టం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నల్లగొండలో ఏర్పాటు చేసుకుందాం అన్నారు. పామాయిల్ తోటలు వేయండి భారీ లాభాలు ఉన్నాయ్. పామాయిల్ తోటకు ఎకరానికి 50 వేలు ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. ఈ ఐదు ఏండ్లలో 10 లక్షల పామాయిల్ తోటలు వేయండి అన్నారు. రైతు భరోసా 7500 రూపాయలు కూడా రైతులకు ఇస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.సి.నారాయణరెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, అధికారులు నాగిల్లా మురళి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News