అన్నను చంపించిన తమ్ముడు..అసలేం జరిగిందంటే..?

భూ వివాద విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు రావడంతో.. కిరాయి గుండాలతో అన్నను తమ్ముడు హత్య చేయించిన సంఘటన మాడుగుల పల్లి మండలం నారాయణపురంలో చేసుకుంది.

Update: 2024-10-23 10:39 GMT

దిశ,మిర్యాలగూడ: భూ వివాద విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు రావడంతో.. కిరాయి గుండాలతో అన్నను తమ్ముడు హత్య చేయించిన సంఘటన మాడుగుల పల్లి మండలం నారాయణపురంలో చేసుకుంది. దీంతో నిందితులను స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం..మాడుగుల పల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరి నరసింహకు ముగ్గురు కుమారులు కాగా.. కాకునూరు లింగయ్య,కాకునూరి కొండయ్య (55) లు గత 20 సంవత్సరాల క్రితం గ్రామ శివారులో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి లింగయ్య పేరున పట్ట చేయించుకున్నారు. కాగా లింగయ్య మృతి అనంతరం కొండయ్యకు తెలియకుండా చిన్న తమ్ముడు కాకునూరి శ్రీను భూమి ని తన పేరున పట్టా చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన కొండయ్య పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినట్లు తెలిపారు.ఈ భూమి విషయంపై ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండడంతో శ్రీను కిరాయి వ్యక్తులతో కలిసి ఈనెల 16న నారాయణపురం గ్రామంలోని ఇంటి వద్ద ఉన్న కొండయ్యపై కత్తులతో దాడి చేయగా..తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా..మృతి చెందినట్లు డిఎస్పి పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు కారణమైన నారాయణపురం గ్రామానికి చెందిన కాకునూరు శ్రీను,నిడమనూరు మండలం రాజన్నగూడెం గ్రామానికి చెందిన వేముల నాగరాజు,నల్గొండ శాంతినగర్ కాలనీకి చెందిన పందిరి లింగస్వామి,చీరాల సురేష్, మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన జిట్టబోయిన వెంకన్న లను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ వీరబాబు,ఎస్సై కృష్ణయ్య లను డీఎస్పీ అభినందించారు.


Similar News