అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. మంత్రి ఉత్తమ్

కోదాడ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-04 09:43 GMT

దిశ, కోదాడ : కోదాడ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.19.60 కోట్ల వ్యయంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అధికారులు అభివృద్ధిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.

ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే పద్మావతి ద్వారా తన దృష్టికి తేవాలన్నారు. జాతీయ రహదారి పై ఉన్న కోదాడ విద్యా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము ఇద్దరం కట్టుబడి ఉన్నామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలక వర్గం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంతలాల్ పవర్, ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, తహశీల్దార్ సాయి గౌడ్, ఎన్ఎస్పీ శాఖల అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News