ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

మండల పరిధిలోని అనాజీపురం ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మిగిలివున్న ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ గుంజా ప్రమీల తెలిపారు.

Update: 2024-07-06 12:10 GMT

దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలోని అనాజీపురం ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మిగిలివున్న ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ గుంజా ప్రమీల తెలిపారు. శనివారం ఆమె తెలిపిన వివరాల ప్రకారం 6వ తరగతి లో 20, 7వ తరగతిలో 10, 8వ తరగతిలో 10 ఖాళీలు ఉన్నాయని వీటిని స్పాట్ అడ్మిషన్స్ ద్వారా నింపడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వారి టీసీ, స్టడీ కండక్ట్, ఆధార్ జిరాక్స్, 2 పాస్ ఫొటోస్ తీసుకుని పాఠశాల కార్యాలయంలో వీలైనంత త్వరగా సంప్రదించగలరని తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పరిమిత సీట్లు గలవని పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వెంటనే సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Similar News