నల్లగొండలోని వైన్స్ ల పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు…

నల్లగొండలో కల్తీ ఆహారం, కల్తీ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం మేరకు వైన్స్ ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Update: 2024-07-06 15:04 GMT

దిశ, నల్గొండ: నల్లగొండలో కల్తీ ఆహారం, కల్తీ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం మేరకు వైన్స్ ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ జోనల్ కమిషనర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వైన్స్ కి ఫాస్ట్​ ఫుడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కలిగి ఉండాలని వైన్స్ యజమానులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం అమ్ముతూ ఉన్నారని కావున పలు అనుమానిత శాంపిల్స్ ని సేకరించినట్లు వాటిని హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపడం జరుగుతుందని గతంలో కూడా నల్లగొండలో పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 63 ప్రకారం ఐదు లక్షల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని ప్రజల ఆరోగ్యంతో ఆటలాడద్దని ఆమె హెచ్చరించారు.

లైసెన్స్ లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారని, వారి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వైన్స్ ల పక్కన ఉన్నటువంటి సిట్టింగ్ వద్ద అనుమతులు లేకుండా ఆహారం తయారు చేయడం వల్ల నాసిరకంగా ఆహారం అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. నాణ్యతలేని ఆహారం అమ్మకుండా మానవతా దృక్పథంతో అన్ని రకాల ఆహార ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు అందించాలని తెలిపారు. నోటి ద్వారా తీసుకునే ప్రతి ఆహార సంబంధిత పదార్థాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలని ఈ శాంపిల్స్ లో కల్తీ అని తేలితే వైన్స్ ల పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అనుమతి లేకుండా వైన్సులు నిర్వహిస్తే వారి మీద 50,000 నుంచి 60 వేల వరకు జరిమానా వేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఆమెతో పాటు నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి పాల్గొన్నారు.


Similar News