కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-04 15:01 GMT

దిశ, కోదాడ/అనంతగిరి : కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం అనంతగిరి మండల కేంద్రంలో మూడు కోట్లతో నిర్మిస్తున్న ఎంపీడీవో తహశీల్దార్ పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తనతో వెంటపడి అనంతగిరి మండల కేంద్రంలో ఈ కార్యాలయాలు మంజూరు చేయించుకున్నారని చెప్పారు. శాంతినగర్ నుండి చనుపల్లికి 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ మంజూరు చేశానన్నారు. కోదాడ మున్సిపాలిటీలో 20 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ టౌన్ హాల్ ముస్లిం ల షాదీ ఖానా ఏర్పాటు పై సమీక్ష సమావేశంలో చర్చించామన్నారు. కోదాడ నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారి కూడా తానే మంజూరు చేయించానని తెలిపారు.

ఎమ్మెల్యే పద్మావతి ఢిల్లీలో అత్యవసర పని ఉండి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు రాలేకపోయారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అనంతగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయ భవనాల నిర్మాణంలో కలెక్టర్ పూర్తి చొరవ తీసుకొని నాణ్యంగా ఆధునిక పద్ధతుల్లో నిర్మించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కొనతం ఉమా శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.


Similar News