రాత్రిపూట అటు వెళ్లాలంటే గ్రామస్తులకు హడలే
రామన్నపేటలో డ్రైనేజీ పైకప్పు కూలిపోయి ప్రమాదకరంగా మారింది.
దిశ, రామన్నపేట : రామన్నపేటలో డ్రైనేజీ పైకప్పు కూలిపోయి ప్రమాదకరంగా మారింది. గత ఆరు నెలల క్రితం డ్రైనేజీ పైకప్పు ధ్వంసం అయిన గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. నిత్యం ప్రజలు తిరిగే ప్రధాన వీధి కావడంతో..చీకట్లో వెళ్లే పాదచారులు, వాహనదారులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో ప్రయాణిస్తున్నారు. పొరపాటున రాత్రిపూట ఎవరైనా అటుగా వెళ్లారంటే అందులో పడే ప్రమాదం ఉంది. అలాగే మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వేదజల్లుతుంది. దీంతో దోమలకు ఆవాసంగా మారి కాలనీవాసులు అనేక రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.