తమ్ముడి అంత్యక్రియలకు వచ్చి..అక్క అనంత లోకాలకు
తమ్ముడి అంత్యక్రియలకు వచ్చి అక్క అనంత లోకాలకు వెళ్లిన సంఘటన కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది
దిశ,కోదాడ : తమ్ముడి అంత్యక్రియలకు వచ్చి అక్క అనంత లోకాలకు వెళ్లిన సంఘటన కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతే మండలం నర్సిపురం గ్రామానికి చెందిన కుడురి విజయలక్ష్మి(40) రమేష్ దంపతులు తొగర్రాయి గ్రామంలో విజయలక్ష్మి చిన్న అమ్మ కొడుకు మృతి చెందడంతో..అంత్యక్రియలకు వచ్చారు. అనంతరం తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళుతున్న క్రమంలో వెనక నుండి వస్తున్న ఢీ కొట్టింది. దీంతో విజయలక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందింది. లారీ విజయలక్ష్మి మీద నుంచి వెళ్లడంతో..మహిళ నుజ్జు నుజ్జు అయ్యింది. మహిళ భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వసుపత్రికి తరలించారు. రమేష్ కి కాలికి తీవ్ర గాయాలు కావడంతో ప్రధమ చికిత్స అందించారు. దీంతో తొగర్రాయి అటు నర్సిపురం గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయంపై కోదాడ రూరల్ పోలీసులు ను వివరణ అడగ్గా ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. రమేష్ ఆర్టీసీ డ్రైవర్ గా యాదగిరిగుట్టలో విధులు నిర్వహిస్తున్నాడు.