రోడ్డు ప్రమాదంలో డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐలాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Update: 2024-12-20 15:49 GMT

దిశ, చివ్వెంల ;రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐలాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కట్టంగూరు మండలం ఎర్రసాని గూడెం గ్రామానికి చెందిన రేపాక సురేందర్ రెడ్డి( 49 )డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సాయంత్రం హైదరాబాద్ నుండి డీసీఎం లో టెలిఫోన్ టవర్ ఫ్యాడ్స్ లోడ్ తో జార్ఖండ్ కు వెళ్తుండగా..గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బావమరిది శిలిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై2 కనక రత్నం తెలిపారు.


Similar News