కారు బోల్తా.. నలుగురికి గాయాలు

కోదాడ మండల పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-12-20 15:36 GMT

దిశ,కోదాడ : కోదాడ మండల పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ వీరేష్ ఎన్ రాజేశ్వరి , ఎస్ మురళీకృష్ణ, ఎస్ పద్మావతి లు కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని కోమరబండ గ్రామ శివారులోకి న్యూ విజన్ స్కూల్ కి రాగానే..కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ ప్రమాదంలో పద్మావతి, రాజేశ్వరికి తీవ్రగాయాలు కావడంతో..విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరేష్ డిప్యూటీ ఎమ్మార్వో గా ఆంధ్రాలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కోదాడ రూరల్ పోలీసులను వివరణ అడగ్గా మాకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదు అన్నారు. 

 


Similar News