పాడి కౌశిక్ రెడ్డి మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిండు.. అందుకే కోతి చేష్టలు : ఎమ్మెల్యే వేముల
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేమల వీరేశం సంచలన ఆరోపణలు చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్ : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేమల వీరేశం సంచలన ఆరోపణలు చేశాడు. పాడి కౌశిక్ రెడ్డి మద్యం తాగి అసెంబ్లీకి వచ్చాడని అన్నారు. అందుకే ఆయన అసెంబ్లీలో కోతి చేష్టలకు పాల్పడుతున్నాడని విమర్శలు చేశారు. అసెంబ్లీలో మీడియా పాయంట్ వద్ద మాట్లాడిన వేముల.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ రూల్స్ ప్రేమ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాటిని ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యారు. హాల్లోకి ప్లకార్డులు, బ్యాడ్జీలు పెట్టుకోని రావద్దని చెప్పినా వాళ్లే ఆ విధంగా వస్తూ సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత స్పీకర్‌ను అసెంబ్లీ వేధికగా అవమానించారన్నారు. స్పీకర్‌పై పేపర్లు విసరడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.