జనగామలో దొంగల బీభత్సం.. భారీగా బంగారం చోరీ!

గ్రామం, పట్టణాలతో సంబంధం లేకుండా రోజురోజుకు దొంగల అరాచకాలు పెరిగిపోతున్నాయి.

Update: 2024-07-02 07:25 GMT

దిశ, జనగామ: గ్రామం, పట్టణాలతో సంబంధం లేకుండా రోజురోజుకు దొంగల అరాచకాలు పెరిగిపోతున్నాయి. దొంగలపై పోలీసులు నిఘా పెట్టినప్పటికీ దొంగలు భయం భీతి లేకుండా మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటూ రెచ్చిపోతున్నారు. రెండ్రోజుల క్రితమే రెండ్రోజుల క్రితమే వికారాబాద్ జిల్లాలో పరిగిలోని ఫీచర్స్ కాలనీలో ఓ కాలేజీ లెక్చరర్ ఇంట్లో ఏకంగా 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, లక్ష ఇరవై ఐదు వేల నగదు చోరీ అయిన విషయం తెలిసిందే. తాజాగా  జనగామ జిల్లా కేద్రంలోని బీరప్పగడ్డ ప్రాంతంలోని బీరప్పగుడి వెనుకాల ఇంటిలో దొంగతనం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గుంటి ప్రేమలత తన ఆరోగ్యరిత్యా హైదదాబాద్‌లో ఓ హాస్పిటల్‌లో చూపించుకుందామని వెళ్లింది. ఉదయం వారి కుటుంబ సభ్యులకు   చెప్పిన సమాచారం మేరకు వచ్చి చూడగా 11 తులాల 4 గ్రాముల బంగారం, 20  తులాల వెండి 15వేల నగదు పోయిందని తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. రాత్రి 1 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. క్లుస్ టీం పిలిపించి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని జనగామ ఎస్ఐ భారత్ తెలిపారు. 

Similar News