అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు : మునుగోడు ఎస్సై వెంకటేశ్వర్లు..

అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని మునుగోడు ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-07-04 15:04 GMT

దిశ, మునుగోడు : అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని మునుగోడు ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల పరిధిలోని కోరటికల్ గ్రామంలో సాండ్ టాక్సీ ట్రాక్టర్ యజమానులకు సాండ్ టాక్సి విధానం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధులు హాజరై మాట్లాడారు. సాండ్ టాక్సీ ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇసుకను అందించాలన్నారు.

సాండ్ టాక్సీ మెసేజ్ వచ్చిన తర్వాతనే ట్రాక్టర్లను వాగులోకి తీసుకెళ్లాలన్నారు. సాండ్ టాక్సీ ముసుగులో అక్రమాలకు పాల్పడితే సదరు వాహనాన్ని సీజ్ చేసి యజమాని పై కేసు నమోదు చేసి జైలు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు తహశీల్దార్ నరేందర్, ఎంపీడీవో పూజ, ఎంపీఓ, ట్రాక్టర్ యజమానులు, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News