విద్యా స్ఫూర్తికి ఆదర్శ పాఠశాల పాత్ర అమోఘం.!

రాష్ట్రవ్యాప్తంగా 2014 తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు తీసుకువచ్చింది అప్పటి ప్రభుత్వం.

Update: 2024-12-03 08:37 GMT

దిశ, తిరుమలగిరి : రాష్ట్రవ్యాప్తంగా 2014 తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల ఏర్పాటు తీసుకువచ్చింది. అప్పటి ప్రభుత్వం. ఆదర్శవంతమైన విద్యను బోధిస్తూ.. విద్యార్థులను వారిలోని ప్రతిభలను గుర్తించి మెరుగైన విద్యను అందిస్తూ నీట్, త్రిబుల్ ఐటీ, పోటీ పరీక్షల్లో సత్తా సాధిస్తూ, క్రీడల్లో సైతం అదే తరహాలో మంచి ప్రతిభను కనబరుస్తూ పేరు తెచ్చుకుంటున్నారు ఆదర్శ పాఠశాల విద్యార్థులు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో గల అనంతారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు భవిష్యత్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా, ఆదర్శంగా నిలుస్తున్నారనేదానికి నిదర్శనం పాఠశాల విద్యార్థుల ప్రగతియే. ఆ పాఠశాల ప్రిన్సిపల్ కోల సంజీవ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సాహాన్నిస్తూ వారు ఎంచుకున్న గమ్యం వైపు సాగేలా తర్ఫీదునిస్తున్నామని, మెడికల్, టెక్నికల్ కోర్సుల్లో ఆసక్తి గలవారికి శిక్షణ ఇప్పిస్తూ.. సామాజిక బాధ్యత, ఔన్నత్యం విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

పాఠశాల ప్రారంభమై 15 ఏళ్లు సమీపిస్తున్న వేళ గతం నుండి నేటి వరకు పదో తరగతి పరీక్షల్లోనూ, ఇంటర్మీడియట్ విద్యలోనూ విద్యార్థులు ప్రథమ శ్రేణిలో 100% ఉత్తీర్ణత సాధించి వాస్తవానికి ఆదర్శ పాఠశాలను ఆదర్శంగానే తీసుకువస్తున్నారని విద్యార్థులు మంచి మంచి ఉన్నత స్థాయిలో ఎంపిక అయ్యి పై చదువులు చదువుతున్నారని, వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే.. బడా నేతల పైరవీలు సాగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. జిల్లాలోనే టాప్ ఆదర్శ పాఠశాలగా రాణిస్తున్నామని విద్యార్థులు సైతం ఇష్టపడి చదివి కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించారని విద్యార్థులకు సూచిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటు అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వాలు ఆదర్శ పాఠశాలలకు మంచి వాతావరణాన్ని అందించే పకృతి పచ్చదనాన్ని నెలకొల్పేందుకు దోహదపడాలని కోరుతున్నారు.


Similar News