ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలని పంచాక్షరీ పౌండేషన్ చైర్మన్ కారింగు పల్లవి తెలిపారు.

Update: 2024-12-26 12:58 GMT

దిశ, చండూరు : మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలని పంచాక్షరీ పౌండేషన్ చైర్మన్ కారింగు పల్లవి తెలిపారు. చండూరు మున్సిపల్ కేంద్రంలోని సాయి దుర్గ కాంప్లెక్స్ లో ఆమె గురువారం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..మహిళలు ఆర్థికంగా బలోపేతం కావటానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పౌండేషన్ ద్వారా మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషన్ కోర్సులల్లో శిక్షణలు ఇవ్వబడుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. 


Similar News