తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా మిట్టపల్లి వెంకటేష్
తెలంగాణ యువజన ఉపాధ్యక్షుడుగా మిర్యాలగూడకు చెందిన మిట్టపల్లి వెంకటేష్ నియామకమైయ్యారు.
దిశ,మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ యువజన ఉపాధ్యక్షుడుగా మిర్యాలగూడకు చెందిన మిట్టపల్లి వెంకటేష్ నియామకమైయ్యారు. ఇండియాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయబాను నియామక పత్రాన్ని బుధవారం ఢీల్లీలో అందజేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి వెంకటేష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పథకాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.