యువతి అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
యువతి అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.
దిశ ,హుజూర్ నగర్ : యువతి అదృశ్యమైన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ ఎస్సై జి. ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం..హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కర్నే స్పందన (22 ) పీజీ చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుందని తెలిపారు. అయితే ఈ నెల 24 బుధవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్ళి..తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కూతురు ఇంట్లో లేకపోవడంతో చుట్టూ ప్రక్కల వెతికారు. అయితే ఎక్కడ వెతికిన ఆమె ఆచూకీ లభించలేదని తెలిపారు. స్పందన తల్లి కర్నే నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.