ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్,సిబ్బంది కరువు
ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాలలో వైద్యులను వెంటనే నియమించాలని, ప్రజలకు వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దిశ ,మేళ్లచెరువు : ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాలలో డాక్టర్ సిబ్బంది ని వెంటనే నియమించాలని ప్రజలకు వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేళ్లచెరువు మండలంలో 1967 వ సంవత్సరం నుండి దీర్ఘకాలిక రోగాలకు వైద్య సేవలు అందిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యశాల లో కొంతకాలంగా డాక్టర్ సిబ్బంది లేక మూతపడింది.
50 సంవత్సరాలుగా సొంత భవనం తో దీర్ఘకాలిక రోగాలు నయం చేయడంలో పేరొందిన ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది లేక పోవటంతో వ్యాధిగ్రస్తులు అనేక ఇబ్బందులకు గురి అవటమే కాకుండా దీర్ఘకాలిక రోగాలకు చికిత్స నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా పురాతనంగా ఉన్న ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాలలో డాక్టర్ ,సిబ్బందిని నియమించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మండల వాసులు కోరుతున్నారు.