ప్రజల వద్దకు పాలన తెచ్చింది టీడీపీ నే: జక్కలి ఐలయ్య

ఎన్టీఆర్ పాలనతోనే పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో చైతన్యవంతులయ్యారని

Update: 2023-03-06 12:42 GMT

దిశ, చండూరు: ఎన్టీఆర్ పాలనతోనే పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో చైతన్యవంతులయ్యారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు . మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రము లో టీడీపీ భువనగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కృష్ణమాచారి తో కలిసి టిడిపి మండల కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్న కరపత్రాలు పంపింని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటేల్ పట్వారి వ్యవస్థలను రద్దు చేసి మండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలను తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు.

ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని తెలంగాణ నడిగడ్డ హైదరాబాదులో పుట్టిన పార్టీని పూర్వ వైభవం కోసం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు వృద్ధాప్య పింఛన్ పక్కా ఇళ్ల నిర్మాణం ఉచిత విద్యుత్ రెండు రూపాయల కిలో బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటగా రాష్ట్రంలో ఎన్టీఆర్ మొదలుపెట్టారని పేర్కొన్నారు . బీసీలు మహిళలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధికి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు దోహదపడ్డారని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదతోనే నేడు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాజ్యమేలుతున్నారని రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పేద వర్గాలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైతుందని,అందుకోసం తెలంగాణలో టిడిపి బలోపేతం కోసం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మాక్కెన అప్పారావు,గట్టుపల్, మునుగోడు, నాంపల్లి మండల పార్టీ కన్వీనర్ లు నెట్టు శ్రీకాంత్,రావెల అంతొని,మొగుధల పార్వతమ్మ, నాయకులు గడ్డం కృష్ణయ్య, పాషా,షరీఫ్, పగడాల లింగయ్య పెట్టుగాళ్ళ అంజయ్య,బోల్ల శంకర్, సూరేపల్లి నరసింహ,చింతకాయల రాజు, శ్రీకాంత్, పేదగని రాములు, కోణం రాము, అవ్వరి సుబ్బారావు,గంజి పరంధములు, బద్దుల వెంకటేష్, కంపా రాములు, శ్రీశైలం, పంకర్ల సుధాకర్,నరేష్,మహేష్, జక్కలి సైదులు, వీరమల్ల జంగయ్య, పంతంగి సత్తయ్య, బొల్లపెల్లి భగవంతు,తదితరులు పాల్గొన్నారు.


Similar News