సమగ్ర కుటుంబ సర్వేలో సూర్యాపేట జిల్లా ఏ స్థానంలో ఉందో తెలుసా?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ఐదవ స్థానంలో ఉందని,సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 87 శాతం సమగ్ర సర్వే పూర్తయినట్లు జిల్లా అదనపు కలెక్టర్ పర్స రాంబాబు తెలిపారు.
దిశ ,నేరేడుచర్ల : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ఐదవ స్థానంలో ఉందని,సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 87 శాతం సమగ్ర సర్వే పూర్తయినట్లు జిల్లా అదనపు కలెక్టర్ పర్స రాంబాబు తెలిపారు. ఆయన గురువారం నేరేడుచర్ల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 369040 గృహాలకు, 319100 గృహాల సమగ్ర సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. పూర్తయిన సర్వే వివరాలను మున్సిపాలిటీ, మండలాల పరిధిలో డాటా ఎంట్రీ ప్రారంభమైందని తెలిపారు. ఆయా గృహాల్లో అందుబాటులో లేనివారు ఇతర ప్రాంతాల్లో ఉండేవారి సర్వే మాత్రమే పూర్తికాలేదని, 2,3 రోజుల్లో నూరు శాతం సమగ్రకుటుంబ సర్వే పూర్తవుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా ఐదవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఐకెపి పిఎసిఎస్ సెంటర్లలో ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యాన్ని, 2100 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 12 లక్షల రూపాయల బోనస్ ను రైతులకు చెల్లించినట్లు వివరించారు. ఇంటి పన్ను వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డిని, ఎండిఓ సోమ సుందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరికోతలు కొనసాగుతున్నందున ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ వసూళ్లపై కమిషనర్ అశోక్ రెడ్డిని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సురభి సైదులు, ఎంపిడిఓ సోమ సుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి, డిప్యూటీ తాహశీల్దార్ మౌనిక ఎంపీఓ బి.హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.