విద్యుదాఘాతంతో దుకాణం దగ్ధం

విద్యుదాఘాతంతో పురపాలక కేంద్రంలో సోమవారం ఓ దుకాణం దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది

Update: 2024-11-11 15:37 GMT

దిశ, భూదాన్ పోచంపల్లి : విద్యుదాఘాతంతో పురపాలక కేంద్రంలో సోమవారం ఓ దుకాణం దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, దుకాణ యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని శ్రీ సాయి మెటల్ మర్చంట్ ఫర్నిచర్ దుకాణంలో యజమాని ధ్యానమైన జంగయ్య రెండు గదుల్లో వంట గిన్నెలు, ఫర్నిచర్ దుకాణం నడిపిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం పక్క షెటర్ లో విద్యుత్ ఘాతంతో ఒకేసారి మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురై బయటికి వచ్చాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే దుకాణం మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దీని విలువ సుమారు మూడు లక్షలు వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. దుకాణం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న జంగయ్య దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో లబోదిబోమన్నాడు. సంఘటన స్థలానికి ఎస్సై భాస్కర్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా మున్సిపావిద్యుదాఘాతంతో పురపాలక కేంద్రంలో సోమవారం ఓ దుకాణం దగ్ధమైన సంఘటన చోటు చేసుకుందిలిటీ పరిధిలోని రీవనపల్లి లో జ్యువలరీ దుకాణంలో ఫైర్ వర్క్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది


Similar News