సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి వినతి
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల కు కేంద్రం నుంచి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కోరుతూ.. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కంచుకట్ల సుభాష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కోరారు.
దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కోరుతూ..ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కంచుకట్ల సుభాష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కోరారు. కరీంనగర్ లోని మంత్రి నివాసంలో కలిసి ఒక వినతి పత్రం ద్వారా కోరినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా మునుగోడు దేవరకొండ నియోజకవర్గం పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు నత్త నడకన సాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో మహేశ్వరం వెంకటేశ్వర్లు ,మారోజు వెంకటాచారి, ప్రకాష్ తదితరులు ఉన్నారు.